Showing posts with label తెలుగులో మంటనక్క. Show all posts
Showing posts with label తెలుగులో మంటనక్క. Show all posts

Thursday, 25 September 2008

మంటనక్క 3.0.2 ఇప్పుడు తెలుగులో

మంటనక్క 3.0.2, 23 సెప్టెంబరు 2008న విడుదల అయింది. తెలుగుతో పాటుగా హిందీ, కన్నడ మరియు మరాఠీ మొదలగు భారతీయ భాషలలో కూడా బీటాలో విడుదలచేయటం జరిగింది. కానీ యిది బీటా కాబట్టి అనువాదంలో తప్పులుండవచ్చని మంటనక్క వారే శలవిస్తున్నారు. తెలుగులో మంటనక్కని యిక్కడనుండి దిగుమతి చేసుకోవచ్చు.

ఆ తప్పులేవో(ఏవైనా ఉంటే) మనమే వారి ద్రుష్ఠికి(తప్పేమో సరిదిద్దగలరు) ఎందుకు తేకూడదూ?(మంటనక్క వారి సముఖమునకు ఎలా తేగలమో ఎవరైనా తెలిసిన వారు శలవిస్తే బావుంటుంది.) మరి యిక కదలండి, మంటనక్క 3.0.2 ని దిగుమతిచేసుకుందుకు. మంటనక్క 3.0.2 రిలీజు నోట్సు(Release Notes) యిక్కడ చూడవచ్చు.