Wednesday 27 June, 2007

ఆంధ్రమహాభరతము శల్వ పర్వము ద్వితీయాశ్వాసము - ఇప్పటి వరకు పూర్తి అయిన పద్యాలు

నేను గత మూడు రోజులుగా ఆంధ్రమహాభరతము శల్వ పర్వము ద్వితీయాశ్వాసము లొని పద్యములు 9_2_271 నుండి 9_2_300 వరకు యూనీకోడీకరించుచున్నాను. ఆ పద్యాలను ఇక నుండి ఇక్కడ Post చేయదలిచాను. ఇప్పటి వరకు పూర్తి అయిన పద్యాలు.




271 వ.

అన్యాయంబునం జంపువాఁ డింతియ మాయలు గలపగఱ మాయాప్రకా
రంబులంబరిమార్చుటయ తగు నింద్రునివృత్రవధవ్యాపారంబు వినమె
జూదంబునప్పు డనిలసుతుండు సుయోధనుతొడలు విఱుగ నడుచువాఁడ
నని ప్రతిన పట్టినవాఁ డది యట్లుండె గదాయుద్ధంబు నాభికి దిగువ
యైనశరీరభాగంబు నొప్పించుట ధర్మంబుగాదది యొండుమైఁ గండడఁచి
మఱిపరిభవరూపంబుగ నూరుభంగంబు సేసి ప్రతిజ్ఞ నెఱపువాఁ డిది
తలంపునం బెట్టక పెనంగెనేని ధర్మనందనునకు దైన్యంబు దెచ్చు
నట్లగుటఁ బూనికిపేర నూరులు భంజించి వధియించుట తప్ప నొండు
పాయంబు లేదు ధర్మనందనునివలన మనకు భయం బావహిల్లె నెట్లనిన
భీష్మద్రోణ ప్రముఖబలవదరాతులం బొలియించుటంజేసి జయంబును
యశంబునుం జేకుఱి యున్న యెడ నవి సందిగ్ధంబు లైనయట్లు గా
నొకని జయించి సామ్రాజ్యంబు గొనమని దుర్యోధనుతోడం బలికి
యతనితోడం గదాసమరంబునకుఁ భీమసేనుం జొనిపె నింతనిర్బుద్ధి
యగునె హతబంధుమిత్రపరివారుండై రాజ్యంబునం దాస విడిచి మడువు
సొచ్చినవాని వెదకి వెలార్చి యెక్కటికయ్యంబునకుఁ బిలుతురే పదు
మూఁడు వత్సరంబులు మత్సరాధికుం డగునగ్గాంధారేయుండు భీము జయిం
చుట కయిగదా పరిశ్రమం బాచరించె నూర్ధ్వతిర్యగ్గతిసముల్లాసంబున
మెఱయుచున్నవాఁ డీ భీమునకుం బెద్ధకాలం బేని శ్రమంబు లే దిమ్మహా
భాగుండు ధర్మంబు దొఱంగియైన నిక్కులపాంసనునిం బిలుకుమార్ప
కున్న నింక నించుక సేపునకుఁ దాన తెగుఁ దెగిన మీకు నెల్ల నిప్పా
పాత్ముండు రాజగుట కోర్వవచ్చునే యనుటయు.




272 క.

విని క్రీడి యపుడు మారుత
తనయుఁడు ధనుఁ జూడ నూరుతలము కరతలం
బున నప్పళించె నతఁడును
గనికొనియెను సన్న యగుటఁ గౌరవముఖ్యా.



273 వ.

కనికొని యధర్మంబైన నూరుభంగంబు సేయు మని కృష్ణానుమతి
జిష్ణుండు వనిచె నాకు నొండుమెయి నెట్లును బగతుపాటు లేక తక్కె
నే నవ్విధం బాచరింతును కాక యని మనంబున నిశ్చయించి వివిధగతులఁ
జరియింపం గురుపతియు బాహుచిత్రప్రచారంబుల నుల్లసిల్లఁ దత్సం
గ్రామం బామిషార్ధిగరుడద్వయసమరంబున దర్శనీయం బై యుండె నట్టియెడ.



274 ఆ.

పాండురాజుసుతుఁడు పతుతరోల్లసి యై
వైచుటయును ధరణివల్లభుండు
తొలఁగ దాఁటె రయముదలకొనిగదఁబుచ్చి
కొనియె నాబకాంతకుండు నుఱికి.

-: ధుర్యోధనుఁడు భీముగదాదండమునఁ దొడలు విఱిగి పడుట :-
275 క.

ఆలోనం గురుధరణీ పాలుఁ
డడరి వ్రేయుటయును బవనసుతునిమై
సోలె నది గానఁ డాపతి
కేలీవిభ్రమము దోఁపఁ గ్రేళ్లుఱికె నృపా.



276 చ.

ఉఱికినఁ దేఱి పై కుఱికి యుగ్రత భీముఁడు వ్రేయ నవ్విభుం
డుఱక మహాద్భుతస్ఫురణ నూర్ధ్వపరిభ్రమణంబు సేసినం
దెఱిపి యతండు గాంచి సముదీర్ణరయంబున వై చెఁ బెన్దొడల్
విఱిగి నగాగ్ర ముద్భటపవిత్రహతిం బడుచాడ్పునం బడన్.



277 వ.

అప్పుడు మహొల్కాపాతంబులును బాంసుమాంసరక్తవర్షంబులును
వికృతంబులగుకరితురగబృంహిత హేషాఘోషంబులును మఱియు ననే
కోత్పాతంబులును గలిగిన నట్లు కౌరవపతి వడుటకు నుబ్బునం బొదలిన
పాంచాలురుం బాండవులు నుద్విగ్నచిత్తులైరి వియత్తలం బంతయు
నొక్క మ్రౌఁతగా నగ్గదాయుద్దవిశేషంబు లగ్గించుచు సురగరుడఖచ
రాదులు నిజస్థానంబులకుం జని రిట్లు తనగదతాఁకునఁ దొడలు విఱిగి
సింగంబుచేతం గూలిన గంధశుండాలంబుచందంబునం బడి యున్న
నీకొడుకుం జేరం జని భీమసేనుండు.



278 తే.

ఏకవస్త్రం బాంచాలి న ట్లీడ్చి తేరఁ
బనిచి సభలోనఁ బఱిచినపాపఫలము
ననుభవింపుము దుష్టాత్మ యనుచు వామ
చరణమున బెట్టిదము గాఁగ శిరము దన్నె.



279 వ.

తన్ని యలుక మలుగక యతనియాననం బాలోకించి.



280 క.

పసు లని యార్చుచు మము ను
ల్లస మాడినధర్మహీనులను నృపధర్మం
బెసఁగఁగనే మిదె యిప్పుడు
పసు లని యార్చెదము మగుడ బంధుద్రోహీ.



281 క.

విను మేను కల్లసారెలు
గొని కపటపునెత్త మాడుకుశలతఁ గా దొ
ప్పనివారు నే పడంచుట
ఘనబాహుస్యైరకేళిఁ గాని దురాత్తా.



282 వ.

అని పలికి పెలుచ నవ్వి ధర్మనందనగోవిందపాంచాలప్రకరపార్ధసాత్యకి నకుల సహదేవుల నాలోకించి.



283 ఆ.

శంక లేక కడఁగి సభ కట్లు పాంచాలి
నంటరాని దాని నొంటి చీర
తోన యున్న సాద్వివేనలి వట్టి యీ
డ్పించి నతనిఁ జూడుఁ డంచుఁ బొదలి.



284 వ.

పాంచాలి సేసినపాపంబు పెంపున నీశోధనంబు సమకూఱె ననిన విని
వారు ఫ్రమోదంబు నొంద మిక్కిలి సంతసంబునం దేలి యక్కురు
ఘస్మరుఁదు నర్తించు చెన్నుదోఁపఁ జెలంగి.



285 చ. (ఈ పద్యము సరిగ అగుపించుటలేదు కావున కొంత భాగము వదిలివేయబడినది)

మును మము గొడ్డువోయి రని ముష్కరతం జెడనాదినట్టిదు
ర్జనుల ననిం గదంగి ధృతరాష్టృరనూజుల బంధువర్గమి
త్రనికరసైన్యకోటిసహితంబు ------------- గంటి మిం
క నమరలోక మైన నరకం బయిన-- సరి మాకు వారయిన్.



286 క.

అని గదఁ జేకొని నృప నీ
తనయునిమెడ వట్టి యదిమి తల గ్రమ్మఱఁద
న్నినఁ గని మును దన్నుట నె
మ్మన మెరియు తదగ్రజుం డమర్షముతోడన్.



పై పద్యములయందు ఏవైనా తప్పులు గమనించిన యెడల దయచేసి తెలుపగలరు.
ఆంధ్రమహాభరతం PDFకు లంకె http://ia331342.us.archive.org/2/items/andhramahabarath025919mbp/andhramahabarath025919mbp.pdf

--
చందు(తెలుగు కుర్రోడు)
http://telugukurrodu.blogspot.com/

No comments:

Post a Comment