Wednesday 27 June, 2007

ఆంధ్రమహాభరతము శల్వ పర్వము ద్వితీయాశ్వాసము - పద్యాలు 287 నుండి 290 వరకు

287 వ.

హర్షావేశలఘుగారిత్రుం దగునమ్మారుతపుత్రున కి ట్లనియె.


288 చ.

తల యది యేల తన్నెద వధర్మము నొందుట కాత్మ రోయఁగా
వలవదె రాజరా జనుజవర్గముఁ దక్కినబంధుకోటియుం
గలపరివారముం దెగిన గౌరవ మేదకఁ బోరి సంగర
స్థలమునఁ బడ్డ నీతులువచందముచేఁత జనంబు మెచ్చునే.


289 క.

మును లోకము ధర్మపరుం
డనఁ బరఁగినవాఁడ విట్టు లనుచితకృత్యం
బునకుఁ జనఁ దగునె దీనం
గనియెడుఫల మేమి దూష్యగర్వం బేలా.


290 వ. (ఈ పద్యములోని కొన్ని అక్షరాలు సరిగా కనిపించుటలేదు. వాటి స్థానమున అడ్డగీతలుంచబడినవి గమనించగలరు.)

అని దూఱి దుర్యోధనుం జూచి బాష్పా--లోచనుండై.

--
చందు(తెలుగు కుర్రోడు)
http://telugukurrodu.blogspot.com/

No comments:

Post a Comment