Tuesday 3 July, 2007

ఆంధ్రమహాభరతము శల్వ పర్వము ద్వితీయాశ్వాసము - పద్యాలు 291 నుండి 300 వరకు

291 తే.

కారి యయినవైధవ్యంబు కారణముగ
నన్ను నిందితురును వచనములు మొదలు
గాఁగ బహువిలాపంబులఁ గరుణ మావ
హిల్ల దురవిల్లె నుల్లంబు దల్లడిల్ల.


293 చ.

అనిలసుతుం డధర్మమున నమ్మెయిఁ గౌరవమే-నీశ్వరుం
దనయెదుర& వధింపఁగ గదాసమరాభిలధర్మ వేది నాఁ
జనినహలాయుధుండు గని స--య యే మని పల్కె నంత వాఁ
డనుజులకు& మఱందులకు నట్టియెక న్మొగమోడ నేర్చునే.


294 చ.

అనవుడు నాతఁ డిట్టు లను నమ్మనుజేంద్రున కప్డు రోహిణీ
తనయుఁడు కోపవేగమునఁ దామ్రముఖం డయి లేచి బాహు లె
త్తి నృపతులార చూచితిరె తెల్లముగా బకవైరివిక్రయం
బునతెఱఁ గిట్టివాని మనభూములఁ గంటిమె యెన్నఁ డేనియున్।


295 వ.

గదాయుద్దంబున నాభికి దిగువ యగు శరీరభాగంబు నొప్పించుట ధర్మంబు
గాదను శాస్త్రోక్తి వినమె వీఁడు విచ్చలవిడిఁ దెంపు సేసె నని పలుకు
నమ్మహాత్ముని మనంబున రోషానలంబు సముత్థితం బగుటయు నప్పుడు.


296 క.

నిజరధముమీఁది హలమును
ధు-ధరమునం దమర్చి భూమి యద్రువ వా
యుజు దెసకు నడచె నుద్భట
గజరిపుచంక్రమణరేఖ గతియం దొలయన్.


-: శ్రీకృష్ణుఁడు బలరామునకుఁ గోపోపశమనంబు చేయుట :-

297 వ.

దానికిం బవమానసూనుండు సోదరభుజబలనిజబలంబు లేకముఖత్వంబున
నెప్పుడుం గలుగు మనోబలంబువలనం జలింప కుండె నట్టియెడ వేగంబ
విన యవనతుం డగుచు నచ్యుతం డడ్డంబు సొచ్చి దీర్ఘవృత్తపీనంబు
లగు బాహువుల హలాయుధుఁ బిట్టి కైలాసశైలంబు గదిసినయంజనమహీ
ధరంబు మాడ్కి నొప్పి యనూనస్వరంబున నతని కిట్లనియె.


298 క.

తనవృధ్ధియు మిత్రుని వ
ర్ధనమును దత్సఖసమృధ్ధి ప్రబలుటయును శ
త్రునిదెస నన్నియుఁ జెడుటయు
ననుష్డ్విధములను దన్ను నతిశుభ మొందున్.


299 వ.

ఏతత్ప్రకారంబు విపరీతం బగుట యొప్ప దట్లు గావున మిత్రునకుం
గీడువాటిల్లి నెద నేర్పు గలుగునేని మైత్రిపరుం డయిన పౌరుషశాలి యది
----- జేయు సత్యపరాక్రములగు పాండవులు మనకుఁ బరమ
మిత్రులు విశేషించి మన మేనత్తకొడుకు లనీతిపరులచేతం బరిభవింపం
బడినవారు గావున వీరల కభ్యుదయంబు గలిగించుట నీకుం
గర్తవ్యంబు.


300 తే.

ప్రతిన నెఱపుట నృపులకుఁ బరమధర్మ
మగుట మనమునఁ జర్చింపు మనిలసుతుఁడు
గద సుయోధనుతొడలు భగ్నములు సేయు
వాఁడు గా సభఁ బూనినవాఁడు గాఁడె

No comments:

Post a Comment