Wednesday 17 October, 2007

నేనూ పుస్తకాలు చదవడం మొదలెట్టానోచ్

నాకు చిన్నప్పట్నుంచి పుస్తకాలు చదవడమంటే యిష్టం. పదవ తరగతి వరకు ప్రతి ఎండాకాలంలో మా ఊరి గ్రంధాలయం నుండి అరువు తెచ్చుకున్న పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. నాకీ అలవాటేలా అబ్బిందో మరొక టపాలో చెప్తాను. ఆ పుస్తకాలన్ని ఎక్కువగా మన స్వాతంత్రోద్యమవీరుల గురించిన చిన్నచిన్న పుస్తకాలు. యివికాక స్వామీ వివేకానందా మరియు రామకృష్ణ పరమహంస మున్నగు వారి గురించిన పుస్తకాలు. ఎక్కువగా చరిత్ర పుస్తకాలు.

ఇక పదవ తరగతి తరువాత యిటువంటి పుస్తకాలు చదివే అవకాశం నాకెప్పుడూ దొరకలేదు. దానికొక కారణం మేము మా ఊరువిడిచి చదువులకై వేరొక ఊరు మారటం ఒకటైతే, యింటర్ తరువాత ఎంసెట్ అలా తీరికలేని చదువులు యింకొక కారణం.

అపుడెప్పుడో మరచిపోయిన ఆ అలవాటు ఈ మద్య మళ్ళీ తిరిగి ఊపిరిపోసింది, నేను బెంగళూరు రావటంతోటే(ఈ మధ్యలో నా పి.జి. సమయంలో కొన్ని పుస్తకాలు చదివినా అవన్నీ నవలలు). బెంగళూరు రావటం రావటం మా అన్నయ్య(పెదన్నాన్న గారబ్బాయి) వాళింట్లో దిగా. ఆక్కడ అన్నయ్య వాళ్ళింట్లో దాదాపు ఒక యాభై పుస్తకాలు ఉన్నాయి. వాటిని చూడ్డంతోటే నాలోదాగున్న పుస్తకపఠనాభిలాష మళ్ళీ కొత్త ఊపిరిపోసుకుంది.

పైదంతా ఒకయెత్తు, ఇక్కడ బ్లాగ్లోకంలో కూడా బ్లాగర్లలోని(కనీసం నాలోని) పఠనాభిలాష పెంపొందింప ప్రయత్నించిన రాకేశ్వరరావు గారు, కూడా మరొక కారణం.

యిక పుస్తకాల విషయానికొస్తే









యిప్పటికే చదివినవి(నేను చదివిన క్రమంలో)
పుస్తకం పేరురచయిత పేరు
నాన్నకె.వి.నరేందర్
బారిష్టరు పార్వతీశంమొక్కపాటి నరసింహ శాస్త్రి
బుడుగుముళ్ళపూడి వెంకట రమణ
దీపం చెప్పిన కతలుగోపిని కరుణాకర్








చదువుదామని మొదలెట్టి చదవలేకపోయినవి
పుస్తకం పేరురచయిత పేరుకారణం
చెంఘీజ్ ఖాన్గుర్తులేదుఇది నేను చిన్నప్పుడు చదువుదామని మొదలుపెట్టి అనువాదం అర్ధంకాక వదిలేసా, అప్పటికీ రెండు సార్లు ప్రయత్నించా, నా వల్ల కాలా. అది పెద్ద పుస్తకం సుమారు 500 వందల పేజీలు వుండేవి.
ఊరుకె.వి.నరేందర్దీనిలో వాడిన మాండలికం అర్ధం కాక చదవలేకపోయా. అప్పుడు నాకు అనేక యితర పుస్తకాలు అందుబాటులో వున్నాయి యిదికూడా ఒక కారణం.






యిప్పుడు చదువుతున్నవి
పుస్తకం పేరురచయిత పేరు
దర్గా మిట్ట కతలుమహమ్మద్ ఖాదీర్ బాబు







ముందు ముందు చదవాలనుకొంటున్నవి
పుస్తకం పేరురచయిత పేరు
ఊరుకె.వి.నరేందర్



యిప్పుడు చదువుతున్న పుస్తకం "దర్గా మిట్ట కతలు - మహమ్మద్ ఖాదీర్ బాబు" గురించి ముందుముందు నా నుండి రాబోయె టపాలలో చూడండి।

నేను ముందే చదివిన పుస్తకాల గురించి మరెప్పుడైనా వ్రాస్తాను.

------
చంద్ర శేఖర్ కాండ్రు

7 comments:

  1. miku aasakti vunte ee pustakaalu kuda chadavandi Kutumbaravu sahityam, Sripada vari sahityam, chivaraku migiledi, buchibabu kadhalu, chaduvu, malladi chandra sekhara sastri gari kadhalu, chera gari kadhalu..inka chala vunnai, indulo ye daina chadivite cheppandi, inka cheptanu.

    ReplyDelete
  2. చెంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి రాసిన పుస్తకం ఒకటుంది. బాగానే ఉంటుంది. మీరన్నంత పెద్ద పుస్తకం కాదు.. ఓ రెండొందల పేజీలుండొచ్చు.

    ReplyDelete
  3. మీకు మళ్ళీ పఠనాసక్తి కలగటం, చదివే అవకాశం దొరకటం సంతోషం. చదువరి చెప్పినట్టు తెన్నేటి సూరి రాసిన చెంఘీజ్ ఖాన్ చక్కగా చదివించేటట్లు ఉంటుంది. మీకు చారిత్రక పుస్తకాలు చదవడం ఇష్టమైతే రాహుల్ సాంకృత్యాయన్ గారి పుస్తకాలు (వోల్గా నించి గంగకు, జయ యౌధేయ, సింహ సేనాపతి) ప్రయత్నించండి. దర్గామిట్ట కతల రచయిత పేరు "మహమ్మద్" ఖదీర్ బాబు.

    ReplyDelete
  4. @చంద్ర,

    చివరకు మిగిలేది, బుచ్చిబాబు కధలు, చదువు, మల్లాది చంద్ర శేఖర శాశ్త్రి గారి కధలు, చెర గరి కధలు ఇవేవి ప్రస్తుతానీకి నాదగ్గరలేవు. యిక్కడేమైనా దొరుకుతాయేమో చూస్తా. నెనర్లు.

    @చదువరి,
    మీరు చెప్పిన చెంఘీజ్ ఖాన్ చదివన్నా నా అహాన్ని సంత్రుప్తి పరుస్తాను ప్రస్తుతానికి.

    @కొత్తపాళీ,
    దర్గా మిట్ట కధలు రచయిత "మహమ్మద్"గా సరిదిద్దాను. తప్పును తెలియజేసినందుకు నెనర్లు.

    ReplyDelete
  5. some more
    bhanumati-athagaaru
    paanuganti
    chilakamarthi
    chintaadeekshitulu-vati rao
    munimaanikyam-kaantam
    mds prasad
    nandoori paardasaaradhi
    gurajaada-kanyashulkam.

    ReplyDelete
  6. miku nenu rasina pustakalu edi kavalanna, Visalandra publications lo dorukutai.

    ReplyDelete
  7. శ్రీ శ్రీ గారి అనంతం కూడా కలుపుకోండి

    ReplyDelete