Friday 4 July, 2008

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ పద్యం

"చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ", ఈ పద్యం మీరువినే ఉంటారు. కనీసం కొంతవరకైనా, ఏమంటారు? నేను కూడా అంతే. ఎప్పుడూ ఈ పద్యాన్ని పూర్తిగా విన్నట్టు గుర్తులేదు. "జంబలకిడిపంబ" సినిమాలో మిమిక్రీ సన్నివేశంలో కూడా ఉంది.

ఆ పద్యం అంతర్జాలంలో విహరిస్తుంటే యిక్కడ కనిపించింది. అంతకు ముందు వరకు పైన నేను రాసిందే సరైనదని అనుకొనేవాడిని. మరి ఏది అసలైనదో పెద్దలే చెప్పాలి. అక్కడ అది ఒక బొమ్మలో ఉంది. అదే యూనీకోడ్‌లో ఉంటే బావుంటుంది కదా! అని యిక్కడ పొందుపరిచాను. ముందు ముందు ఎప్పుడైనా చూడాలనిపించినా ఉంటుంది కదా అనేది ఒక కారణమైతే, బ్లాగరులుకూడా ఒకసారి చూస్తారు కదా అనేది మరొక కారణం. యిక పూర్తి పద్యం

కరమున వెన్నముద్ద కరమున చెంగల్వ
పాముల మొలత్రాడు పట్టుదట్టి
సంధ్య ఘీంకృతియును సరిమువ్వ గజ్జెలు
చిన్ని గణప! నిన్ను చేరి కొలుతు!!

లంకెలో పై పద్యమే కాక, పద్యంలోని వర్ణనకు తగ్గట్లుగా బాపూగారి విఘ్నేశ్వరుని బొమ్మ కూడా ఉంది. మీకు యిది ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తాను.

1 comment:

  1. చేత వెన్నముద్ద చెంగల్వపూదండ
    బంగారు మొలత్రాడు పట్టుదట్టి
    సందెతాయెతులును సరిమువ్వగజ్జెలు
    చిన్ని కృష్ణా నిన్ను చేరికొలుతు
    ఇదీ నేను నేర్చుకున్న పద్యం.
    మీరు వ్రాసినది వినాయకుని మీది పద్యం కాబట్టి ఇంకొకరెవరైనా అదే మార్గంలో వ్రాసి ఉండొచ్చు ననుకుంటున్నాను.

    ReplyDelete